టీఆర్‌ఎస్‌లో చేరికపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

ex minister sabita indrareddy today join in trs party

టీఆర్‌ఎస్‌లో చేరికపై స్పందించారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలంటే పార్టీ మారక తప్పడంలేదన్నారు. పార్టీ మార్పు విషయంలో తమ నిర్ణయాన్ని కార్యకర్తలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు . టీఆర్‌ఎస్‌కు తమకు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి వైరుద్యాలు లేవని స్పష్టం చేశారు .

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రావాలంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఇదే సంకల్పంతో తన భర్త ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలో పనిచేశారని అన్నారు. 19 సంవత్సరాలుగా తనకు రాజకీయంగా.. కాంగ్రెస్ , సోనియా, రాహుల్, వైఎస్‌ఆర్‌లు అన్ని విధాల అండగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో తనతో పాటు చేరుతున్న వారు.. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు సబితా ఇంద్రారెడ్డి.

Also Read : పొంగులేటికి బ‌దులు.. ఆ వ్యాపార‌వేత్తకు టిక్కెట్..!

Recommended For You