'RRR' గురించి వస్తున్న వార్తలు నిజమా...? లేక అబద్ధమా..?

RRR గురించి వస్తున్న వార్తలు నిజమా...? లేక అబద్ధమా..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న " RRR " సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టిస్టారర్ మూవీగా, డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న " RRR " వచ్చే ఏడాది జూలై 30న విడుదలకాబోతుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. సినిమాకోసం వేసిన ప్రత్యేక సెట్స్ లో మొన్నటి వరకు షూటింగ్ జరిపిన టీమ్, రీసెంట్ గానే బల్గేరియా షెడ్యూల్ కి వెళ్ళింది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారనే టాక్ వినిపించింది.

" RRR "కి సంబంధించి ప్రజెంట్ టాలీవుడ్లో చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లోనే.... పులితో పోరాడతాడట. ఈ ఫైట్ సీన్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. అలాగే ఇందులో కేవలం మూడు పాటలే ఉంటాయట. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు చెరొక పాట, ఇధ్దరికీ కలిపి మరొకటి ఉంటాయట. సినిమాని కూడా 3 గంటలు తీయకుండా, రెండున్నర గంటల నిడివిలోనే కంప్లీట్ చేస్తారట. స్టార్ గ్రూప్ తో శాటిలైట్ రైట్స్ విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.

పైన తెలిపిన విషయాలు...నిజమా కాదా అనే సందేహం మాత్రం చాలా మందికి కలుగుతోంది. ఎందుకంటే రాజమౌళి అంత తేలిగ్గా ఇలాంటి విషయాలను బయటకు రానివ్వడు. సినిమాలోని హైలైట్స్ ని ఇంత త్వరగా బయటకొచ్చేంత అవకాశం జక్కన్న కల్పించడు. చాలా పకడ్బిందీగా ఉంటాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చాలా వరకు ఊహించి చెప్తున్నవే అయి ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి, మరింత జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story