జక్కన జోరు.. తెలంగాణ యాసలో తారక్.. చెర్రీకి జోడీగా..

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి రాబోతున్న సినిమా కాబట్టి. ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రకరకలా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ గురువారం ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన అప్డేట్స్ ని మీడియాతో షేర్ చేసుకుంది.

ఆర్.ఆర్.ఆర్. మూవీ పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కోమరం భీమ్ ల స్పూర్తితో తెరకెక్కుతోంది. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్ మూవీగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇందులో రామ్ చరణ్, అల్లూరి సీతారామారాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రతిష్టాత్మక ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. రాజమౌళితో ఎన్టీఆర్ కి ఇది నాలుగో సినిమా. కొమరం భీమ్ పాత్రకోసం ఎన్టీఆర్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు.

400 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. అలియాభట్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. అలాగే అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెండు షెడ్యూళ్ళ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు, మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రిపుల్ ఆర్ టీమ్ పర్పెక్ట్ ఆన్సర్స్ ఇచ్చింది.

Also Read : 2020లో కె.జి.ఎఫ్‌ 2 డ‌బుల్ ధ‌మాకా ట్రీట్‌

Recommended For You