ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధికి సహకరిస్తున్న అసమ్మతి నేతలు

tdp leaders combined in tirupati

తిరుపతి టీడీపీలో అసమ్మతి జ్వాలల చెల్లారడం లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాజాగా సుగుణమ్మ వ్యతిరేక వర్గమంతా మరోసారి సమావేశమయ్యారు. ఆమెకు సీటిస్తే ఎట్టిపరిస్థితుల్లో కలిసి పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు అసమ్మతి నేతలు..

మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే సీటును గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌. ఎమ్మెల్యే సీటు ఎవరికి ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గతంలో ఎమ్మెల్యే సుగుణమ్మను వ్యతిరేకించిన నేతలు చాలామంది ఇప్పుడు ఒక్కటి అవుతుండడంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తంమవుతోంది.