మరోసారి బరి తెగించిన పాకిస్థాన్

pakstan

బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉడికి పోతున్న దాయాది దేశం…. కయ్యానికి కాలు దువ్వుతోంది.‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతునే ఉంది. తాజాగా ఎల్‌ఓసీ వద్ద పాక్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడంతో…. టెన్షన్‌ వాతారవణం నెలకొంది. వాటిని గుర్తించి మన సైన్యం….. ఐఏఎఫ్‌ బలగాలను అలర్ట్‌ చేసింది.

పాకిస్థాన్ తన బుద్ది మార్చుకోలేదు. బాలకోట్‌ ఘటన తర్వాత.. కడుపు మంటతో ఉన్న పాకిస్థాన్‌… సరిహద్దుల్లో రెచ్చిపోయింది. తాజాగా… నియంత్రణ రేఖ వైపు గా 2 పాకిస్థాన్ యుద్ధ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో దూసుకువచ్చాయి. పూంచ్ సెక్టార్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఫైటర్ జెట్స్ దూసుకెళ్లాయి. ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో విమానాలు దూసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది…..

పాక్ వైమానిక దళం దుశ్చర్యలతో భారత వాయుసేన అప్రమత్తమైంది. పాక్ యుద్ధ విమానాల కదలికలను భారత వైమానిక దళానికి చెందిన రాడార్లు గుర్తించాయి. వెంటనే IAF బలగాలను అప్రమత్తం చే శాయి. బోర్డర్‌తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన వైమానిక స్థావరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది….

అటు… ఎఫ్-16 యుద్ధ విమానాలను సైతం సరిహద్దు వెంబడి ఉన్న వైమానిక స్థావరాల్లో పాక్‌ మోహరించినట్లు సమాచారం. ఎప్పుడు దాడి చేయమంటే అప్పుడు దాడి చేసేలా సిద్ధంగా ఉండాలంటూ పాక్ వాయుసేన అధికారులకు పాక్ సైన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే రేంజర్లు, ఇతర సైనిక బలగాలను కూడా ఎల్వోసీ వద్దకు భారీ సంఖ్యలో తరలిస్తు న్నట్లు తెలుస్తోంది….

పుల్వామా ఉగ్రదాడి తర్వాత బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీల్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 27న పాక్ వాయుసేన మన గగనతలంలోకి దూసుకు వచ్చింది. ఐతే, పాక్ వాయుసేన ప్రయత్నాలను మన వాయుదళం ధీటుగా తిప్పికొట్టింది. ఆ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత పైలట్ అభినందన్ కూల్చేశారు. దీంతో పాకిస్థాన్‌ రగిలిపోతోంది. అందుకే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతోంది.

Recommended For You