రేపటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

cm chandrababunaidu talk about pattiseema and krishna godhavari

రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు..అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంటకు సేవామిత్ర, బూత్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. కార్యకర్తల సమావేశం తరువాత తిరుపతిలో జరిగే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు.

రేపు సాయంత్రం శ్రీకాకుళంలో ఎన్నికల సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 17న విజయనగరం , విశాఖ, ఉభయగోదావరి… 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా…19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. జిల్లాల్లో సభలు ముగిసిన తర్వాత బస్సుయాత్ర చేపడతారు. చంద్రబాబు బస్సు యాత్రకు టీడీపీ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది.

తిరుపతి తారకరామ స్టేడియం జరిగే చంద్రబాబు సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. ఈ సభకు పెద్ద ఎత్తున జనం తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు.