కాంగ్రెస్ మైండ్ బ్లాంక్..ఎవ‌రిని ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే..

trs operation akarsh
trs operation akarsh

తెలంగాణలో కార్ ధాటికి కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అవుతోంది. రోజుకో ఎమ్మెల్యే కారువైపు పరుగులు తీస్తుండటంతో ఎటు పాలుపోని స్థితిలో ప్రతిపక్షం బిక్కమోహం వేసింది. ఎమ్మెల్సీ నోటీఫికేష‌న్ తో స్టార్ట్ అయ్యిన ఈ పిరాయింపుల్లో.. మొద‌టగా ఆత్రం స‌క్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ గుడ్ బై చెప్పారు. ఆ వెంట‌నే.. హ‌రిప్రియ నాయ‌క్, చిరుమ‌ర్తి లింగ‌య్య హ్యాండిచ్చారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ హోంమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్క‌డం కాంగ్రెస్ షాకిచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోకముందే.. పాలేరు ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి .. కేటీఆర్ ను క‌ల‌సి టీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ గా కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు సైతం కేటీఆర్ తో భేటి అవ్వ‌డంతో అరచేతిలో అగ్గిరాజుకుంటోంది. ఏం జరుగుతుందో అంతుబట్టేలోపే కాంగ్రెస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్లాన్ ఏ .. ప్లాన్ బీ ఎజెండాతో సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా వీలైనంత వ‌ర‌కు ప్లాన్ ఏ ను ప‌క్క‌గా అమ‌లు చేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంత‌కే ఏమిటీ .. ప్లాన్ ఏ ..? అంటే కాంగ్రెస్ లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని పార్టీలోకి తీసుకోవ‌డం .. వారికి కండువాలు క‌ప్ప‌కుండా .. ఆ 13 మంది ఎమ్మెల్యేల‌తో సీఎల్పీ నేత‌పై తిరుగుబాటు చేస్తున్న‌ట్లు .. కొత్త‌గా త‌మ‌లో ఒక‌రిని సీఎల్పీ నేత‌గా ఎన్నుకున్న‌ట్లు లేఖ ఇప్పించ‌డం. దాంతో స్పీక‌ర్ వారినే అస‌లైన సీఎల్పీగా గుర్తించ‌డం. ఇక అసెంబ్లీలో పోగా మిగిలిన ఎమ్మెల్యేల‌కు వెన‌క బేంచీలు కేటాయించ‌డం . పిరాయింపు ఎమ్మెల్యేల‌నే అస‌లైన సీఎల్పీగా స్పీక‌ర్ గుర్తిస్తే .. తాము ఏ పార్టీ ఎమ్మెల్యేల‌మో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను నెట్ట‌డం.

ఇక పిరాయింపు ఎమ్మెల్యేల‌తో ఏర్ప‌డ్డ సీఎల్పీ నేత‌తో ..అసెంబ్లీలో అధికార పార్టీ ఏం మాట్లాడినా .. శ‌భాష్ అంటూ కితాబిప్పించుకోవ‌డం. ఏది అధికార పక్షం .. ఏది ప్ర‌తిప‌క్షం తెలియ‌ని విధంగా కాంగ్రెస్ ను దెబ్బ‌తీయ‌డ‌మే ఈ ప్లాన్ ఏ ముఖ్యుద్దేశం. అది సాధ్యం కాకుంటే .. ప్లాన్ బీ అమ‌లు కు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ప్లాన్ బీ ఏమిటీ ..? అంటే .. పార్టీ మారి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి .. ఉపెన్నిక‌ల‌కు వెళ్ళి .. బంప‌ర్ మెజారిటీతో గెలిపించుకొని .. మ‌ళ్ళీ కాంగ్రెస్ ను ఈ ఉపెన్నిక‌ల ప‌రుతో కోలుకోని దెబ్బ‌తీయ‌డం. దీంతో ఇప్ప‌ట్లో కోలుకోలేని విధంగా కాంగ్రెస్ ను దెబ్బ‌తీస‌య‌డ‌మే ఎజెండాగా గులాబీ బాస్ పావులు క‌దుపుతున్నట్లు స‌మాచారం.

ఇక ఎమ్మెల్యేలను పార్టీమార్చుకోవ‌డం కూడా రెండు విడ‌త‌లుగా డేటూ .. టైమ్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కొంత మందిని పార్ట‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు చేర్చుకోగా . మ‌రి కొంద‌రిని ఎన్నిక‌ల త‌రువాత చేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఎవ‌రిని ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే అప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి .. కాంగ్రెస్ కు షాకియ్య‌మే అస‌లు ఎజెండాగా క‌నిపిస్తుంది.

మొత్తానికి అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ను కోలుకోని విధంగా దెబ్బ‌తీసేలా గులాబీ బాస్ అడుగులు ప‌డుతున్నాయి. మ‌రి కేసీఆర్ వ్యూహాల‌ను చెక్ పెట్టేలా కాంగ్రెస్ ఏమైనా కౌంట‌ర్ పార్ట్ చేస్తుందా .. లేక చ‌తిక‌ల ప‌డుతుందా చూడాలి.