పార్టీ మారేందుకు సిద్దమైన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

congress mla vanama venkateswarao maybe join in trs

తెలంగాణ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుముర్తి లింగయ్య, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి ఇప్పటికే టీఆరెస్ లో చేరుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. దీంతో ఆయన పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.