ఎక్స్‌క్యూజ్‌మీ.. మీ డ్రెస్ మరీ.. : విమానంలో సిబ్బంది..

నాడ్రెస్ నా ఇష్టం. ఎలాంటి డ్రెస్ అయినా వేసుకుంటాను. అడగడానికి మీరెవరంటూ విమాన సిబ్బందిపై విరుచుకు పడింది మోడ్రన్‌గా డ్రెస్ చేసుకున్న ఓ వనిత. థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ విమానం యూకేలోని బర్మింగ్ హామ్ నుంచి క్యానరీ ఐల్యాండ్స్‌కు వెళుతోంది. అందులో ఎమిలీ కానరీ అనే ఓ యువతి ఎక్కింది. చెకింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందినీ ఆమె ఎదుర్కోలేదు.

కానీ విమానం ఎక్కిన తరువాత సిబ్బంది ఆమె డ్రెస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్‌ పైన మరో టాప్ వేసుకోమని సూచించారు. లేకపోతే విమానంలో నుంచి దించేస్తామని హెచ్చరించారు. పైగా ఫ్లైట్‌లో సహాయకులుగా ఉన్న నలుగురితో పాటు మేనేజర్ కూడా అదే మాట అన్నారు. దాంతో ఎమిలీకి పిచ్చ కోపం వచ్చింది.

వెంటనే ఎయిర్‌లైన్స్ అధికారులకు ట్వీట్ చేసింది. సిబ్బంది తనని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గురించి వివరించింది. దీనిపై స్పందించిన ఎయిర్ లైన్స్ అధికారులు ఆమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. మా సిబ్బంది ఇలాంటి సునిశిత సమస్యని మరింత బాగా హ్యాండిల్ చేసి ఉండవలసింది అని ఎమిలీకి వివరించింది.