అవినాష్ రెడ్డి-వివేకానంద్ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్నాయి:ఆదినారాయణ రెడ్డి

vivek-nagareddy
vivek-nagareddy

వైఎస్ వివేకానంద మృతిపై అనుమానాలు వస్తున్నాయి అన్నారు మంత్రి మంత్రి ఆదినారాయణ రెడ్డి. దీనిపై లోతుగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తప్పు చేస్తే ఉరి శిక్ష వేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా.. రాజకీయ లబ్ది కోసం టీడీపీపై ఆరోపణలు చేయడం వైసీపీ అలవాటు అయిపోయిందన్నారు. జగన్ పై దాడి విషయంలోనూ ఇదే తరహాలో ఆరోపణలు చేశారని ఆదినారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి-వివేకానంద్ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్నాయని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు..

 • వివేకానంద మృతిపై ఆరోపణలు వస్తున్నాయి-మంత్రి ఆదినారాయణ రెడ్డి
 • అనుమానాలపై లోతుగా విచారణ జరగాల్సి ఉంది-ఆదినారాయణ రెడ్డి
 • తప్పు చేసిన వారికి ఉరి శిక్ష వేయాలి-ఆదినారాయణ రెడ్డి
 • ఎక్కడ ఏది జరిగినా మాకు అపాదించడం కరెక్టు కాదు-ఆదినారాయణ రెడ్డి
 • జగన్‌పై దాడి విషయంలోనూ ఇదే తరహా ఆరోపణలు చేశారు-ఆదినారాయణ రెడ్డి
 • ఎంపీ సీటు విషయంలో వైఎస్‌ కుటుంబంలో విబేధాలు ఉన్నాయి-ఆదినారయణ రెడ్డి
 • ఈ ఎన్నికల్లో వివేకా ఎంపీ సీటును ఆశిస్తున్నారు-ఆదినారాయణ రెడ్డి
 • ఎమ్మెల్సీగా ఓడినప్పటి నుంచి వివేకా ఆవేదనతో ఉన్నారు-ఆదినారాయణ రెడ్డి
 • అవినాష్‌ రెడ్డి- వివేకా మధ్య గొడవలు ఉన్నాయి-ఆదినారాయణ రెడ్డి
 • సీట్ల కసరత్తుపై టీడీపీ బిజీగా ఉంటే.. మాపై ఆరోపణలు చేస్తారా?-ఆదినారాయణ రెడ్డి
 • ఫ్యాక్షన్‌ వద్దని రాజీపడి మేం ప్రశాంతంగా ఉన్నాం-ఆదినారాయణ రెడ్డి
 • మొదట గుండెపోటు అని చెప్పి.. తరువాత సినిమా మార్చేశారు-ఆదినారాయణ రెడ్డి
 • ప్రతి విషయంలోనూ తప్పుడు ఆరోపణలు చేస్తే భగవంతుడు ఊరుకోడు-ఆదినాయరణ రెడ్డి