రివ్యూ: జెస్సీ..సౌండ్స్‌తో భ‌య‌పెట్టింది..!

review-jessie
review-jessie

విడుదల తేదీ : మార్చి 15, 2019

నటీనటులు : అభినవ్ గౌతమ్, అతుల్ కుల్కర్ణి, కబీర్ డుహాన్ సింగ్, పావని గంగిరెడ్డి

దర్శకత్వం : వి అశ్వని కుమార్

నిర్మాత : శ్వేతా సింగ్

సంగీతం : శ్రీచరణ్ పాకాలా

సినిమాటోగ్రఫర్ : సునీల్ కుమార్ ఎన్

ఎడిటర్ : గ్యారీ బీ హెచ్

హార్రర్ సినిమాలు కమర్షియల్ విజయం సాధించడం మొదలయ్యాక ఆ జానర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ హార్రర్ కి సీరియస్ ప్రజెంట్ చేసే సంఖ్య తక్కువుగానే ఉంది . అలాంటి సినిమాలలో ఒకటి జెస్పీ. ట్రెలర్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. మరి జెస్సీ ప్రేక్షకులను ఎంత వరకూ ఎంగేజ్ చేసిందో చూద్దాం…

కథ :
కొంతమంది( అభినవ్ గౌతమ్, అభిషేక్,పూర్ణిమ, పావని గంగిరెడ్డి) గోస్ట్ హాంటర్స్ తమ ప్రాజెక్ట్ లో భాగంగా విక్టోరియా హౌస్ కి బయలుదేరతారు. దారిలో వారికి ఒక అమ్మాయి (అర్చన) పరిచయం అవుతుంది. ఆమె సహాయంతో విక్టోరియా హౌస్ లోకి ప్రవేశించిన గోస్ట్ హాంటర్స్ కి అక్కడ జెస్సీ, యామి అనే ఇద్దరు అక్కా చెల్లిళ్ళు ఉండే వారని వారు ఒక ప్రమాదంలో చనిపోతారని తెలసుకుంటారు. మరి ఆ అక్కా చెల్లిళ్ళ కథ తెలుసుకునే ప్రయత్నంలో వారికి అక్కడ కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. మరి వారి వాటని ఎలా సాల్వ్ చేసారు..? ఆ విక్టోరియా హౌస్ నుండి ఎలా బయట పడ్డారు అనేది మిగిలిన కథ..?

కథనం:
దెయ్యం కథలకుండే కొన్ని బేసిక్ పాయింట్స్ ని మీరకుండా కొత్త కథనం చూపెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు అశ్విన్ కుమార్. అయితే జెస్సీ వచ్చిన సమస్య కానీ అతను ప్రజెంట్ చేసిన విధానం కానీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి.
జెస్సీ పాత్రను ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. ఆ పాత్ర కోణంలో ఆమె చెల్లి పాత్రను ప్రజెంట్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ కథలోకి వెళ్ళిన ప్రేక్షకుడికి ఊపిరి తీసుకోనివ్వని ఉత్కంఠను కలిగించాడు. ముఖ్యంగా ఎమీ పాత్ర ఎదో ఒక డిజార్డర్ తో భయపడుతుంటుంది. జెస్సీ ఆమెను బాగు చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో ఒకరోజు అర్ధరాత్రి ఆమె బిగ్గరగా అరవడం మొదలు పెడుతుంది. భయంగా ఎమీ గదిలోకి వెళ్ళిన జెస్సీకి ఎమీ మంచం క్రింద ఎవరో ఉన్నారు.. నాకు భయమేస్తుందంటుంది. మంచం క్రిందకు చూసిన జెస్సీకి అక్కడ ఎమీ కనపడుతుంది. పైన ఎవరో ఉన్నారు నాకు భయం వేస్తుంది అంటుంది. అప్పుడు జెస్సీ కలిగిన షాక్ ప్రేక్షకులకు కలిగిన షాక్ ఒకేలా ఉంటుంది. హార్రర్ సినిమాలు చూసే టప్పుడు సాధారణంగా ప్రేక్షకులు ఒక పాత్రకు కనెక్ట్ అవుతారు..కాసేపటకి ఆ పాత్ర భయాలు, ఆనందాలు ప్రేక్షకులవి అవుతాయి. అలా జెస్సీ పాత్రతో ట్రెవల్ చేయడం మొదలు పెట్టిన ప్రేక్షకుడు చాలా ట్విస్ట్ లు చూస్తాడు. నెక్ట్స్ ఏం జరుగుతుంది ఏ భయం వెంటాడుతుంది అనే ఆందోళన జెస్సీకి ప్రేక్షకులకు కలుగుతాయి. కానీ సెంకండాఫ్ లో అతుల్ కులకర్ణి , కబీర్ డుహాన్ సింగ్ పాత్ర లు అప్పటి వరకూ తెలిసిన కథను మరోలా చెప్పడం మొదలు పెడతాయి. అక్కడే జెస్సీ మరింత గ్రిప్పింగ్ గా సాగుతుంది. అసలు జెస్సీ ఎవరు..? ఆమెకు ఏంకావాలి..? దేనికోసం ఆమె విక్టోరియా హౌస్ లో ఉంది. దెయ్యం పట్టింది ఎమీకా ..? కాదా..? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకులకు ఊహించే గ్యాప్ ఇవ్వకుండా ట్విస్ట్ లతో కథను మరింత టైట్ గా నడిపాడు. జెస్సీ పాత్ర లో కనిపించిన అష్మిత నర్వాల్, ఎమీ పాత్రలో కనిపించిన శ్రీత చందన తమ పాత్రలకు న్యాయం చేసారు. సెకండాఫ్ లో పాయింట్ రివీల్ అయ్యాక జెస్సీ కథ కొంచెం కన్యూజన్ గా మారుతుంది. అసలు జెస్సీ సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహాలు కలుగుతాయి. జెస్సీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చిన కబీర్ మద్యలో ఎందుకు ఆగిపోయాడో అర్దం కాదు. ఒక సమస్యను పరిష్కరించడం అంటే ఆ సమస్య మరోసారి తలెత్తకుండా చూసుకోవడం కానీ కబీర్ చేసిందేమిటో అర్దం కాదు.. జెస్సీ పార్ట్ 2 ప్లాన్ చేసి ఈ కథను సగంలో ఆపారా అనిపిస్తుంది. సునీల్ కుమార్ సినిమాటోగ్రపీ, శ్రీకరణ్ పాకాలా సంగీతం జెస్సీకి ప్రధాన ఆకర్షణగా మారాయ. హార్రర్ సినిమాలకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ, ఆమూడ్ నుండి ప్రేక్షకులకు బయటకు వెళ్ళకుండా చూడటంలో సంగీత దర్శకుడు శ్రీచరణ్ చూపిన ప్రతిభ అసాధారణంగా గా ఉంది. జెస్సీ అసందర్భంగా పూర్తిగాని కథలా అనిపించినా, హార్రర్ సినిమా నుండి ఎక్సెప్ట్ చేసే ఎక్స్ పీరియన్స్ ని అందించడంలో డిజప్పాయింట్ చేయలేదు.

చివరిగా:
భయపెట్టడంలో సక్సెస్ అయిన జెస్సీ కథ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. హార్రర్ ని ఇష్టపడే వారిని మెప్పిస్తుంది.