వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్‌ ఏర్పాటు

ys vivekananda reddy career

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో.. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) బి.లక్ష్మీనారాయణ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.

అనుమానాస్పద మృతి వార్తలపై తక్షణం స్పందించిన సీఎం చంద్రబాబు.. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌, కడప జిల్లా పోలీసులతో మాట్లాడిన సీఎం.. అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్‌ చేయాలని.. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశం.

Also Read : న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం