డ్రా చేసిన డబ్బులు చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!

RS 2000 Notes
RS 2000 Notes

ఏటిఎం నుంచి నగదు డ్రా చేసేందుకు వెళ్ళిన వ్యక్తి వచ్చిన డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. డ్రా చేసిన సొమ్ములో చిరిగిన నోట్లు ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన విజయవాడలోని మైలవరంలో వెలుగుచూసింది.

మద్దాలి గణేష్ అనే వ్యక్తి నారాయణ థియేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్‌బిఐ ఏటిఎంలో రూ.30 వేలు డ్రా చేశాడు. అందులో 10 రెండు వేల రూపాయల నోట్లు చిరిగినవి వచ్చాయి. చిరిగిన నోట్ల విలువ రూ 20 వేలు ఉండడంతో అతను నిర్ఘాంతపోయాడు.

దేశంలోనే అతి పెద్ద బ్యాంకైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వినియోగదారులను ఇలా మోసం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురికి ఏటిఎంలో చిరిగిన నోట్లు దర్శనమిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదివరకు ఇలా చాలా సార్లు చిరిగిన నోట్లు పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.