మేనిఫెస్టోలో వారికి భారీ హామీ ఇచ్చిన జనసేన

janasena chief pawan kalyan contesting two seats

రైతులు, యువత, విద్య ఇలా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా మేనిఫెస్టో ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతు కష్టాలు తెలిసిన వాడిగా…రాష్ట్ర రైతాంగ అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు పవన్ కళ్యాణ్. ఎకరాకు 8 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న పవన్ కళ్యాణ్..60 ఏళ్లు నిండిన సన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామని అన్నారు. అలాగే రైతులకు సోలార్ మోటార్ లు అందిస్తామన్నారు. 5 వేల కోట్లతో గ్లోబెల్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.

అటు యువత ఆకట్టుకునేలా ఉద్యోగాల భర్తీపై తమ మేనిఫెస్టోలో భారీ హామీ ఇచ్చింది జనసేన. పది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించారు. విద్యా రంగంలో ప్రక్షాళన చేస్తామన్న పవన్ కళ్యాణ్..కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ గా చదువు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కులాలను కలిపి కామన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

విద్య, ఉద్యోగాలతో పాటు వైద్య రంగానికి తమ పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది జనసేన. అధికారంలోకి వస్తే హెల్త్ బడ్జెట్ ను రెండింతలు చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్యభీమా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 130 స్మార్ట్ సిటీల అభివృద్ధి…మత్స్యకారుల సంక్షేమం..తక్కువ వడ్డీకే రుణాలు వంటి హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. త్వరలో పూర్తి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్.