వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసుపై స్పందించిన జగన్..

వైఎస్ వివేకానంద హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని అన్నారాయన. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని గొడ్డలితో హత్య చేస్తే..కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వివేకానంద చనిపోయే ముందు లెటర్ రాసినట్లు నకిలీ ఆధారాలు సృష్టిస్తున్నారని విచారణ తీరును తప్పుబట్టారు.

వివేకానంద హత్య కేసులో సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు జగన్. చంద్రబాబు చేతికింద పనిచేసే వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారాయన. తాను ఉండగానే ఎస్పీకి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయని..తప్పుడు లెటర్ సృష్టించి డ్రైవర్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారాయన.

వివేకానంద హత్య కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు హయంలో తన తాత చనిపోయారని…తన మీద దాడి జరిగిందని..ఇప్పుడు తన బాబాయి హత్యకు గురయ్యాడని ఆరోపించారు. మరణానికి ముందు రోజు కూడా చంద్రబాబు వైఎస్ ను బెదిరించినట్లు ఆరోపించారు జగన్.

Also Read : వివేకానంద రెడ్డి హత్య కేసు.. పోలీసుల అనుమానం అతని మీదే!