రామ్మోహన్ నాయుడుకి పోటీగా వైకాపా నుంచి..

rammohan naidu

సార్వత్రిక సమరం మెుదలవడంతో సిక్కోలులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. పోలింగ్ తేదీకి ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో అభ్యర్దులు ప్రచార బాట పట్టారు. ప్రధాన పార్టీలు అధికారికంగా జాబితాలు ప్రకటించకపోయినా . అంతర్గతంగా అధినేతలు ఇచ్చిన హామీలతో ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. టీడీపీ అభ్యర్ధిపై స్పష్టత ఉన్నా.. వైసీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంది.

శ్రీకాకుళం పార్లమెంట్ స్దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ పోటీ చేసి గెలుపొందినవారు ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతారనే ప్రచారం ఉంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించి డిల్లీ స్దాయిలో సత్తా చాటారు. కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2009లో ఎంపీగా గెలిచిన కిల్లి కృపారాణి కూడా కేంద్రమంత్రి గా పని చేశారు. ఇలా ఈ పార్లమెంట్ స్థానానికి ప్రతిష్ట ఏర్పడింది.. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు మృతి తరవాత ఆయన కుమారుడు రామ్మెహన్ నాయుడు ఎంపీగా గెలిచి కేంద్ర రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు..గత ఎన్నికల్లో వైకాపా తరపున రెడ్డి శాంతి, టీడీపి తరపున పోటీపడిన రామ్మోహన్ నాయుడు సునాయాసంగా గెలుపొందారు.. ముందు నుండి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్మోహన్ తండ్రి రాజకీయాన్ని ఒంటబట్టిచుకున్నాారు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రెడ్డి శాంతి ఆ మేరకు వ్యూహరచన చేయలేకపోయారు.. రామ్మోహన్ కు తండ్రి సానుభూతితో పాటు స్థానికంగా ఆయన కుటుంబానికి ఉన్న చెరిష్మా కలసి వచ్చింది.. ఇక చాన్స్ దొరకడంతో ప్రస్తుతం రామ్మోహన్ రాజకీయల్లో దూసుకుపోతున్నాడు. మంచి వాగ్ధాటితో పాటు అందరితో కలిసి మెలిసి ముందుకు వెళుతున్నారు. యువకుడు , విద్యావంతుడైన రామ్మోహన్ పొలిటికల్ కెరీర్ మంచి జోరు కనిపిస్తుంది. తండ్రికి తగ్గ తనయుడిగా అధినేత చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామ్మోహన్ . అధికారంలో ఉండి అనేక పోరాటాలతో ప్రజల మద్య ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.

బలమైన ప్రత్యర్దిని ఢీ కొట్టడానికి అంతే బలంగా అభ్యర్దులను రంగంలోకి దింపాలి . కాని వైకాపా పరిస్దితి అందుకు భిన్నంగా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ కు పోటీలో ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు ను ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్దిని వెతికే పనిలో వైకాపా కాలం వెళ్లదీస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ ఇంచార్జ్ లను మారుస్తూ వచ్చింది. రెడ్డి శాంతి , తమ్మినేని సీతారాం వంటి సీనియర్ నేతలను పార్లమెంట్ ఇంచార్జ్ లుగా నియమించింది. బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేనితో రామ్మహన్ కు చెక్ పెట్టాలని అధినేత జగన్ బావించినా తమ్మినేని ఎంపిగా పోటీకి నిరాకరించడంతో అచ్చెంనాయుడుపై టెక్కలిలో పోటీచేసి ఓటమి చవిచూసిన దువ్వాడ శ్రీనుకు పార్లమెంట్ బాద్యతలు అప్పగించింది. జగన్ పాదయాత్ర జిల్లాలో కొనసాగిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడా కనిపించలేదు ఆయన ఎంపి బరిలో లేనట్లు తెలుస్తుంది. రెండువేల తొమ్మిదిలో ఎర్రంనాయుడుపై గెలుపొంది. చివరి క్షణాల్లో కేంద్ర సహాయ మంత్రి పదవి చేపట్టిన కిల్లి క‌ృపారాణి తాజాగా పార్టీలో చేరటంతో ఆమె పేరు తెరపైకి వస్తుంది. ఎంపీ విషయంలో వైకాపా వ్యవహారం ఏంటో ఆపార్టీ నేతలకే అర్ధం కావడంలేదని పబ్లిక్ టాక్.

వైసిపి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్దిని వెతికే పనిలో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. గత ఎన్నికలలో కనీసం రెండు నెలల ముందు రెడ్డి శాంతిని అభ్యర్దిగా ప్రకటించిన జగన్ , నేడు కనీసం నెలరోజులు కూడా సమయం లేని పక్షంలో కూడా చూచాయగా కూడా అభ్యర్ది పేరును చెప్పటంలేదని లోలోన మదన పడుతున్నారు వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు.

Recommended For You