వేటకొడవళ్లతో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి.. ASI కాళ్లకు బుల్లెట్‌..

clash between tdp and ycp in mantralayam

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం కగ్గలులో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారానికి వెళ్లారు. దీంతో.. బాలనాగిరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వేటకొడవళ్లతో తిక్కారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బాలనాగిరెడ్డి వర్గీయులు వెనక్కు తగ్గకపోవడంతో తిక్కారెడ్డి గన్‌మెన్లు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.

మంత్రాలయం మండలం కగ్గలు.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం. అక్కడ ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి… పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇంతలో ఎమ్మెల్యే భార్య, మరో అనుచరుడు ప్రదీప్‌రెడ్డి వచ్చి జెండాను తొలగించారు. తిక్కారెడ్డిపై దాడి చేశారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిక్కారెడ్డి గన్‌మెన్లు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మాధవరం ASI వేణుగోపాల్‌ కాళ్లకు బుల్లెట్‌ తగడలడంతో ఆయన కింద పడి పోయాడు. ఆయన్ని తిక్కారెడ్డి వాహనంలో ఆసుపత్రికి తరలించారు.