ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు.. ఎదురొచ్చిన సతీమణి భువనేశ్వరి

cm chandrababunaidu going to election campaining

ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు అమరావతి నుంచి తిరుపతి పర్యటనకు బయల్దేరారు టీడీపీ అధినేత చంద్రబాబు. పంచెకట్టుతో శ్రీవారి చెంతకు పయనమయ్యారు. అమరావతి నుంచి బయలుదేరే ముందు తన నివాసం దగ్గర సంప్రదాయాలను పాటించారు. చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాగా…తన సతీమణి భువనేశ్వరి ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టింది. అనంతరం ఇంటి ముందు వేసిన ముగ్గులకు చంద్రబాబు దంపతులు నమస్కారం చేశారు. అనంతరం హెలీకాప్టర్‌లో నారా లోకేష్‌తో

మొదట తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. సాయంత్రం తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో శ్రీకాకుళం వెళ్లి.. కోడి రామమూర్తి స్టేడియంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.