దగ్గుబాటి దారెటు..

daggubati venkateswarao what next

దగ్గుబాటి దారెటు అన్నది సందిగ్ధంలో పడింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు హితేస్‌కు వైసీపీ నుంచి పర్చూరు సీటు ఖాయమంటూ మొన్నటి రకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనను వైసీపీ పక్కన పెట్టింది. అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో పోటీ చేసే అవకాశాన్ని హితేష్‌ కోల్పోయారు. తనయుడికి అవకాశం లేకపోవంతో తానే స్వయంగా రంగంలోకి దిగాలని వెంకటేశ్వరరావు భావించారు. అధిష్టానం సైతం వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. పర్చూరులో స్థానిక నేతలు మాత్రం దగ్గుబాటికి సహకరించేది లేదంటున్నారు.

పర్చూరులో స్థానిక వైసీపీ శ్రేణులను కలిసి మద్దతివ్వాలని ఆయన కోరారు. స్థానిక వైసీపీ సమన్వయ కర్త రామనాదం బాబు మాత్రం ఎన్నికల్లో సహకరించనని స్పష్టం చేశారు. దీంతో తాన భవిష్యత్తు ఏటని నిర్ణయించుకోలేకపోతున్నారు దగ్గుబాటి. ఇంకా ఆయన అధికారికంగా వైసీపీ సభ్యత్వం కూడా తీసుకోలేదు.

ఇటు బాపట్లలో టీడీపీకి చెందిన ఓ కీలక నేత వైసీపీ నుంచి పర్చూరు సీటుపై కన్నేశారు. ఇప్పటికే ఆయన పార్టీ కర్యకర్తలతో రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతలతోనే టచ్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో పర్చూరు సీటు ఎవరికి ఇస్తారన్నదానికిపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Recommended For You