మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త

Good news for Metro train passengers

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్ పేట్ – హైటెక్ సిటీ మార్గంలో రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అనుమతి ఇచ్చింది. ఈ కారిడార్‌లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబర్ మాసం నాటికే అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. నాలుగు నెలలుగా ఈ కారిడార్ లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా సాదాసీదాగానే ఈ రూట్‌లో మెట్రో రైళ్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు.