ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు..వారిలో ఇద్దరు..

sextuplets
sextuplets

థెల్మా చియాకా అనే మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది . ఈ సంఘటన అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో చోటుచేసుకుంది. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా మరో నలుగురు మగపిల్లలు. వీరు శుక్రవారం ఉదయం 4.50 నుంచి 4.59 మధ్య జన్మించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువుల ఆరోగ్యం
నిలకడగా ఉందని ఆస్పపత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో పిల్లల్ని వైద్యుల సంరక్షణలో ఉంచామన్నారు. అంతలోనే ఇద్దరు ఆడపిల్లలకు పేర్లుకూడా పేట్టేశారు. జినా, జూరియెల్‌గా నామకరణం చేశారు.

ఓకే కాన్పులో ఇద్దరు కంటే ఎక్కువ శిశువులు జన్మించిన సంఘటనలు చాలా అరుదు. 1997లో యూఎస్‌లోని ఐయోవా రాష్ట్రంలో కెన్నీ, బాబి మెక్‌కాగే దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. అలాగే గత నెలలో ఇరాక్‌కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఏడుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా థెల్మా చియాకా ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది .