టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి హైదరాబాద్‌ తరలింపు

clash between tdp and ycp in mantralayam

కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని హైదరాబాద్‌ తరలిస్తున్నారు. రక్తస్రావం అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. అడ్డుకుని, దాడి చేశారంటూ మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన భార్య, అన్న కుమారుడు ప్రదీప్‌రెడ్డి, ఇతర వైసీపీ నాయకులపై ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లో తిక్కారెడ్డి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

ఇవాళ ఉదయం.. మంత్రాలయం మండలంలోని కగ్గలులో ఎన్నికల ప్రచారానికి తిక్కారెడ్డి వెళ్లారు. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ గ్రామం వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం కావడంతో.. ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. తిక్కారెడ్డి ఆవిష్కరించిన పార్టీ జెండాను పీకేశారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చినా పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో.. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గన్‌మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అవి మిస్‌ఫైర్ అయ్యాయి. తిక్కారెడ్డికి, ఓ ASIకి బుల్లెట్లు తగిలాయి.