దారుణం.. అమాయక గిరిజనులను బలి తీసుకున్న పోలీసులు

two people killed in encounter at visakhapatnam agency

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. అమాయక గిరిజనులను బలి తీసుకున్నారు పోలీసులు. నాటు తుపాకులతో పిల్లుల వేటకు వెళ్లిన గిరిజనులను మావోయిస్టులనే నెపంతో గ్రేహౌండ్స్‌ బలగాలు కాల్చిచంపాయి.పెదబయలు మండలం బురద మామిడి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎన్‌కౌంటర్‌లో బట్టి భూషణం, సిదరి జమాదర్‌ అనే గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక గిరిజనులను పోలీసులు బలితీసుకున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.