వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి..

ys vivekanandareddy

వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అంతకు ముందు ఇంటి నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. వివేకా అంతిమ యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.