వారి పదవుల్లో 'టీ' అనే పదం కేసీఆర్ పెట్టిన బిక్ష : కేటీఆర్

వారి పదవుల్లో టీ అనే పదం కేసీఆర్ పెట్టిన బిక్ష : కేటీఆర్
ఇవన్నీ గమనించకుండా ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో త్వరలోనే నిరుద్యోగభృతి వస్తోందని వెల్లడించారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ భవన్‌లో విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న మంత్రి... ఉద్యోగుల సేవలను కొనియాడారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా... రాష్ట్రంలో కరెంట్ పోవడంలేదని గర్వంగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. టీపీసీసీ, టీబీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వారి పదవుల్లో టీ అనే పదం కేసీఆర్ పెట్టిన బిక్ష అని మంత్రి ధ్వజమెత్తారు.

తెలంగాణా ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని పలువురు అన్నారని .. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ విరజిమ్ముతుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు అన్నిరంగాల్లో కలిపి 1.31 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఒక శిశువు జన్మిస్తే ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్‌ మొదలు.. విదేశాలకు వెళ్లి చదువుకునేంత వరకు వివిధ పథకాల రూపంలో అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని గర్వంగా చెబుతున్నా అన్నారు. ఇవన్నీ గమనించకుండా ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story