కనీవినీ ఎరుగని క్యాచ్.. కుర్రాళ్ల క్రియేటివిటికి కేటీఆర్ ఫిదా

క్రికెట్ చరిత్రలో క్రియేటివిటి క్యాచ్. బంతికి బదులు బాలుడే బ్యాట్స్ మన్ వైపు పరిగెడుతూ వచ్చి.. బ్యాట్ మీదకు ఎగిరి స్లిప్ లో నిలుచున్న ఫీల్డర్ చేతిలో పడడం అందరినీ అకర్షిస్తుంది. కుర్రాళ్ల క్రికెట్ వీడియోని చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా ఆశ్చర్యపోయారు.

కుర్రాళ్ల క్రియేటివిటికి కేటీఆర్ ఫిదా అయి.. ఆ వీడియోను వెంటనే రీట్వీట్ చేశారు. అంతేకాదు కుర్రాడు చాలా టాలెంట్ ఉన్న బౌలర్ అని పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.