ఆ టాప్ డైరెక్టర్‌తో పనిచేయాలనే చిరంజీవి కోరిక నెరవేరబోతుందా?

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సైరాతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత కొరటాలకి డేట్స్ ఇచ్చాడు. ఆ తరువాత సినిమాని, సౌత్ ఇండియాలోనే ఓ టాప్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాయి మెగా వర్గాలు. ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చిరంజీవి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కూడా. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా.? అతనే దర్శకుడు శంకర్.

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ గా పేరున్నశంకర్ తో సినిమా చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది. ఆ కోరిక ఇప్పటిది కాదు. జెంటిల్ మెన్ సినిమా టైమ్ లోనే చిరు, శంకర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు. అయితే ఈ కాంబినేషన్లో సినిమా నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కే చాన్స్ కనిపిస్తుంది.

నెక్ట్స్ ఇయర్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా చిరంజీవితో ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాని చిరంజీవి కెరీర్లోనే స్పెషల్ గా ఉండాలని, శంకర్ ని ఎప్రోచ్ అయ్యాడట అల్లు అరవింద్. ప్రస్తుతం భారతీయుడు2 పనుల్లో బిజీగా ఉన్న శంకర్, చిరంజీవితో సినిమాకి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడట. అదే జరిగితే చిరంజీవి-శంకర్ కాంబినేషన్లో అదిరిపోయే సినిమా రావడం ఖాయం.

ఇక ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగష్టులో ఈ సినిమా విడుదలకాబోతుంది. భారీ కాస్టింగ్ ఇందులో భాగం కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సైరా కంప్లీట్ అవ్వగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తర్వాతే శంకర్ తో సినిమా పట్టాలెక్కుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని, మెగా ఫ్యాన్స్ అందకూ కోరుకుంటున్నారు.