‘జెర్సీ’ సినిమాపై ట్వీట్.. నాని గురించి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా?

నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘జెర్సీ’ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించి సహజ నటనతో నాని అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాను చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిప్రయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

‘ఇదో అద్భుతమైన సినిమా. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసిన అనుభూతిని కలిగించింది. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని.. దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.. ఇక జెర్సీ మూవీలో నాని నటనకు ముగ్ధుడైన జూ. ఎన్టీఆర్‌… ‘ అద్భుతమైన ప్రదర్శనతో బాల్‌ను పార్క్‌ అవతలకు బాదావు. బ్రిలియంట్‌!!! చాలా రోజుల తర్వాత నీ నుంచి వచ్చిన ఇలాంటి ప్రదర్శన చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా. అని ట్వీట్ చేశారు.

Recommended For You