ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నదిలోకి జంట..చివరకు పడవలొ నుంచి..

pre-weeding-shoot

తరాలు మారుతున్నాయి. అలాగే యువతరం అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. వివాహ పరిచయాలలో ఒకప్పటి తరానికి.. నేటి తరానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. నాటి తరంలో అబ్బాయి, అమ్మాయిలు చూసుకునేది మెుదటిగా పెళ్లి చూపుల్లో, ఆ తర్వాత పెళ్లిలోనే. ఇక మిగతా విషయాలన్ని వివాహం తర్వాతే, కానీ నేటి కాబోయే నవ జంటలు అభిప్రాయాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. పెళ్లి ముందే ముద్దు ముచ్చట తీర్చేసుకుంటున్నారు. నూతన పోకడలతో పెళ్లి కంటే ముందే ఫోటో షూట్ హవా పెరిగిపోయింది. బంధువుల కంటే ఫోటోగ్రాఫర్‌ల హడావుడే ఎక్కువైంది. పరిచయం నుంచి పెళ్లి వరకు అన్నింటినీ కెమేరాలో బంధించుకుని వాటిని మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు.

ఇలానే కేరళకు చెందిన టిజిన్, శిల్ప అనే కాబోయే నవ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చిరస్మరణీయంగా ఉండడం కోసం పంబన్ నది తీరంలోకి వెళ్లింది. అక్కడి లోకేషన్స్‌లో ఫోటోగ్రాఫర్‌లు ఈ జంట ఫోటోలను రకరకాల యాంగిల్‌లో బంధించారు. ఈ క్రమంలో పడవలో కూర్చొన్న ఆ జంట క్లోజ్ షాట్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలొ వైరల్‌గా మారింది. వారు క్లోజ్ అవుతున్న సమయంలో పడవ ఒక్కసారిగా ఓవైపు వంగడంతో వారిద్దరూ నీటిలో పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ ప్లానర్ స్టూడియో ఆన్‌లైన్లో షేర్ చేశారు. దీన్ని పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే 1.5 లక్షల మంది వీక్షించారు. ఇది ఇంతలా వైరల్‌గా మారుతుందని తాము కూడా ఊహించలేదని ఫొటోషూట్ నిర్వాహకుడు బిన్సీ నిర్మలన్ తెలిపారు. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఈ చివరి సీన్‌ని కావాలనే ప్లాన్ చేసినట్లు తెలిపారు.