వాట్సాప్ కొత్త ట్రిక్.. ఇక నుంచి అంత వీజీ కాదు

మీ ఫోన్ ఓసారి ఇస్తారా..నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను అని అడిగిన వారికి ఇచ్చేస్తే.. వారు తీరిగ్గా కాల్ మాట్లాడడంతో పాటు వాట్సాప్‌ కూడా ఓపెన్ చేస్తే.. ఫోన్ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఉంది. అలానే వాట్సాప్‌కి కూడా ఉంటే బావుండేది అని అనుకునే వారికోసం వచ్చేసింది వాట్సాప్ సరికొత్తగా. ఇకపై మీ
ఫోన్‌లో మీరు మాత్రమే ఓపెన్ చేసి చూసుకునే ఫెసిలిటీని కల్పిస్తూ లాక్ సిస్టమ్‌ని పెట్టింది.

ఆఫీస్‌లోకి అడుగుపెట్టేముందు బయోమెట్రిక్‌లో హాజరు వేసినట్టుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలంటే కూడా మీ థంబ్‌ని ఫోన్‌పై పెట్టాల్సిందే. అయితే స్క్రీన్ షాట్స్‌కు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ తప్పనిసరి కాదు. వినియోగదారులు కావాలో వద్దో నిర్ణయించుకుని ఎనేబుల్ చేసుకోవచ్చు. వీటితో పాటు డూడుల్ యూఐని కూడా వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా స్టికర్స్, ఎమోజీలను స్నేహితులతో పంచుకోవచ్చు.