గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల

హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. ఐదేళ్లు సభ సజావుగా నడపడానికి పలు సలహాలు, సూచనలు చేసిన గవర్నర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఘర్షణలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతా బలగాలను ఏర్పాటు చేయడంలో ఈసీ విఫలమైందని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అటు.. సీఎం సమీక్షల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Recommended For You