న్యాయ సేవలో వందేళ్లు

తెలంగాణ హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిలుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సుభాష్‌రెడ్డి, ఎల్‌.నాగేశ్వరరావులతో పాటు.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. తనకు ఈ హైకోర్టుతో 31 ఏళ్ల అనుబంధం ఉందని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలని కోరారు. న్యాయ వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని చెప్పారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.

Recommended For You