అమరావతిలో సందడి వాతావరణం..

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు సీఎంను కలిసి అభినందనలు తెలిపారు… వారు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను సీఎం కట్‌ చేశారు.

సీఎం చంద్రబాబుకు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి శాలువలు కప్పేందుకు కార్యకర్తలు, నేతలు పోటీ పడ్డారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని టీడీపీ అధినేత ఆత్మీయంగా పలకరించారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు తెలుగు మహిళలు కూడా భారీగా తరలివచ్చారు.

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. వీఐపీ లాంజ్‌లో భారీ కేక్‌ కట్‌ చేశారు చంద్రబాబు… మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రబాబుకు కేక్‌ తినిపించారు..

గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి… ఈ వేడుకల్లో మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జీవీ ఆంజనేయులు, మద్దాల గిరి, మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు… భారీ కేక్‌ను కట్‌ చేసి సీఎంకు అభినందనలు తెలిపారు.. టీడీపీ జాతీయ స్థాయిలో ఈవీఎంలపై పోరాటం చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు…

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కటింగ్‌ చేసి సీఎంకు అభినందనలు తెలిపారు… రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారని కొనియాడారు… రాష్ట్రానికి ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని… ఆయన నిండు ఆరోగ్యంతో జీవించాలని కోరుకున్నారు…

తిరుపతిలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు… అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారిని ప్రత్యేకంగా ప్రార్థించారు టీడీపీ నేతలు..అలాగే పలు ప్రాంతాల్లో భారీ కేకులను కట్‌ చేశారు… చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారు టీడీపీ మహిళా నేత సుగుణమ్మ…

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు… చంద్రబాబు 69వ పుట్టిన రోజును కార్యకర్తల మధ్య కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు… మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు.

Recommended For You