డ్యూటీ ముగిసిందని రైలును మధ్యలోనే ఆపేశాడు

goods-train-stopped-mid-way-near-nagapattinam

డ్యూటీ అయిపోయిందని ఓ లోకోపైలేట్ గూడ్స్ రైలును మధ్యలోనే ఆపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవల్‌ క్రాసింగ్, వద్ద రైల్వే గేటుకు మధ్యలో సడన్ గా గూడ్స్ రైలు ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వని కారణంగా ఆగిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రైలును ఆపేసి లోకో పైలెట్‌ ముత్తురాజ్‌ కిందకు దిగేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే అతని డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్‌ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యలోనే గూడ్స్ రైలును ఆపేశాడు.

అంతటితో ఆగకుండా అతడు తన బ్యాగ్‌ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న వాహన ప్రయాణికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు కలుగజేసుకుని అతనికి సర్ది చెప్పి రైలును స్టేషన్ వరకు రప్పించారు. అనంతరం అతనికి కౌన్సలింగ్ ఇచ్చారు అధికారులు. కాగా లోకో పైలెట్ గూడ్స్ రైలును నిలిపివేయడంతో దాదాపు 40 నిముషాలు వాహన చోదకులు ఎండలో మగ్గిపోయారు.

Recommended For You