కోడిగుడ్డుపై ఈకలు పీకే బుద్ది మారదా? : నారా లోకేష్‌

ఏపీలో చంద్రబాబు సమీక్షలపై ఈసీతోపాటు విపక్షాలు అభ్యంతరం చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి లోకేష్‌… ఎన్నికల కోడ్‌ ఒక్క ఏపీలోనే ఉందా… ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు… ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించరా అని నిలదీశారు… కోడిగుడ్డుపై ఈకలు పీకే బుద్ది మారదా అని విమర్శించారు లోకేష్‌…

అలాగే తెలంగాణ సీఎం జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారని… కేసీఆర్‌ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రిగా ప్రకటనలు కూడా చేస్తోందన్నారు… అక్కడ కోడ్‌ వర్తించదా… ఎందుకీ పక్షపాతమని ప్రశ్నించారు లోకేష్‌… అటు ఈసీ తీరుపై మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎన్నికల కోడ్ కేవలం ఏపీకే వర్తిస్తుందా..అని ప్రశ్నించారు?

Recommended For You