ఉగ్ర కలకలం…హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదుల సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పలువురి ఇళ్లలో తనిఖీలు జరిపారు. శాస్త్రి పురానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు… అనంతరం యువకిడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు..

బాసిత్ , ఖదీర్ మరో యువకుడు ముగ్గురు కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ చెబుతోంది. రెండేళ్ల క్రితం బాసిత్ తన స్నేహితులు ఐసిస్ వైపు వెళ్లేందుకు పలు మార్లు ప్రయత్నాలు చేయడాన్ని సిటీ పోలీసులు గుర్తించి బాసిత్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి విడిచి పెట్టారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి నిఘా పెట్టిన ఎన్ఐఏ, సిటీ పోలీసులు ఇప్పటికీ బాసిత్‌ ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు గుర్తించారు.

ఎన్ఐఏ అలర్ట్‌తో భారి కుట్రను భగ్నం చేసి ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు… ఐఎస్ఐఎస్ ఢిల్లీలో ఓ ప్రధాన ఆరెస్సెస్ నాయకుడి హత్యకు ఆదేశించింది. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న యువకులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. వాటి కోసం బాసిత్ అండ్ కో గ్యాంగ్‌కు ఏకే 47ను ఐఎస్‌ఐఎస్ సమకూర్చింది.. ఈ మేరకు ఆధారాలు సేకిరంచినట్లు ఎన్ఐఏ అధికారులు యువకులపై అభియోగాలు మోపుతూ.. చార్జ్ షీట్‌లో దాఖలు చేశారు. హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లిన బాసిత్ అండ్ కో గ్యాంగ్ ఢిల్లీలో మరో బ్యాచ్ టచ్ లోకి వచ్చింది. ప్లాన్ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులకి వచ్చిన పక్కా సమాచారంతో ఆ యువకులను అరెస్ట్ చేశారు.. ప్రధాననిందితుడు బాసిత్ తిరిగి హైదరాబాద్ వచ్చిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

శాస్త్రిపురంలో తాహ మసూద్ అనే యువకుడు కొంత కాలంగా తన కుటుంబంతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కర్నాటకకు చెందిన తాహా మసూద్ ఐసిస్ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు పాతబస్తిలో సైతం సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు… అరెస్ట్ అయిన తహ మసూద్, ఢిల్లీ జైలులో ఉన్న అబ్దుల్ బాసిత్ తోపాటు అబ్దుల్ ఖాదీర్ లతో సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు…

బాసిత్‌కి తహా మసూద్‌కి ఉన్న సంబంధాలు? RSS నేతకి కుట్రలో తహాకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? బాసిత్ ములాఖాత్‌లో తహా కలిసి ఏమి మాట్లాడాడు అనే అంశాలపై విచారణ చేస్తున్నారు NIA అధికారులు… వారిచ్చిన సమాచారంతో మరి కొద్ది మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. భారతీయ యువకులతోనే విధ్వంసాలకు ఐసిస్‌ ప్లాన్ చేసినట్లు NIA అనుమానిస్తోంది.. ఇక బాసిత్, ఖదీర్ కాకుండా ఇండియా నుంచి లేక ప్రధానంగా హైదరాబాద్ సిటీ నుంచి పాక్ లేడి అజీఫాతో టచ్‌లో ఉన్నారా..? అనే కోణంలో దృష్టి సారించారు ఎన్ఐఏ అధికారులు.

Recommended For You