‘ఎఫ్2 , యాత్ర’ సినిమాలకు టీవీ రేటింగ్స్ ఎంతో తెలుసా..

స్మాల్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్, న్యూస్, స్పోర్ట్, డివోషనల్ ఇలా…చాలా రకాల చానల్స్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. అయితే రేటింగ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చానల్స్ కే ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ తెలుగులో టాప్ ఫోర్ లిస్ట్ లో ఉన్న చానల్స్ మాటివి, ఈటివి, జీ తెలుగు, జెమిని టివి. ఆ తర్వాత మూవీ బేస్డ్ చానల్స్ ఉంటాయి. కొద్ది వారాలుగా స్టార్ మాటివిదే ఫస్ట్ ప్లేస్. ఆ పొజిషన్ ని మాటివి ఈ వారం కూడా నిలబెట్టుకుంది.

స్టార్ మాటివి ప్రతి వారం నంబర్ వన్ పొజిషన్ ని నిలబెట్టుకుంటున్నట్లుగానే, ఈ చానల్ లో టెలికాస్ట్ అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఇండివిడ్యువల్ గా నంబర్ పొజిషన్ ని ప్రతివారం నిలుపుకుంటోంది. ప్రతి ఎపిసోడ్ లోనూ ఎమోషన్స్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ కి ఈ వారం 14.52 పాయింట్ల రేటింగ్ తో, వరుసగా మొదటి నాలుగు స్థానాలు సాధించింది.

స్టార్ మాటివిలో సీరియల్స్ అన్నింటికి ఎక్కువగానే ఆదరణ లభిస్తోంది. ఈ చానల్ లో కార్తీకదీపం తర్వాత ఎక్కువ ఆదరణ పొందుతున్న సీరియల్స్ మౌనరాగం, కోయిలమ్మ. ఈ రెండు సీరియల్స్ కి రేటింగ్ కూడా బాగా వస్తోంది. మంచి కథ, కథనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆఖట్టుకుంటున్నాయి. మౌనరాగం సీరియల్ కి ఈ వారం 10.80 పాయింట్లు దక్కితే, కోయిలమ్మకి 10.51 పాయింట్లు వచ్చాయి.

వీటి తర్వాత సిరిసిరిమువ్వలు సీరియల్ 9.94 పాయింట్ల రేటింగ్ సాధించింది. ఇక కథలో రాజకుమారి సీరియల్ కి ఈ వారం 6.06 పాయింట్లు దక్కాయి. అలాగే అగ్నిసాక్షికి 483 పాయింట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సీరియల్ కి రేటింగ్ తగ్గిందని చెప్పాలి. మిగతా సీరియల్స్ అన్ని 5 పాయింట్లకంటే తక్కువగానే రేటింగ్ సాధించాయి.

స్టార్ మాటివిలో ఈ వారం సినిమాలకు కూడా రేటింగ్ బాగా వచ్చింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 మూవీ వరల్డ్ ప్రీమియర్ కి 13.20 పాయింట్లు దక్కాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చింది. ఇక వై.ఎస్.ఆర్ జీవిత కథతో తీసిన యాత్ర మూవీ వరల్డ్ ప్రీమియర్ కి కూడా స్మాల్ స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి 6.18 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

సినిమాలు టెలికాస్ట్ చేయకుండా సీరియల్స్, వీక్లి స్పెషల్స్ తోనే టాప్ రేటింగ్ సాధిస్తోంది ఈటివి. ఈ వారం ఈటివి సెకండ్ ప్లేస్ లో ఉంది. అఫ్కోర్స్ కొద్ది వారాలుగా ఈ ప్లేస్ ఎక్కువగా ఈటివికే దక్కుతోంది. ఈ చానల్ లోని సీరియల్స్ కి టాప్ రేటింగ్ రాకపోయినా వీక్లి ప్రోగ్రామ్స్, ఫెస్టివల్ స్పెషల్స్ తో టాప్ రేటింగ్ తెచ్చుకుంటోంది.

ఈటివిలో ఈ వారం ఇండివిడ్యువల్ గా టాప్ రేటింగ్ తెచ్చుకుంది ఉగాది స్పెషల్ ఈవెంట్. సుధీర్ గాడి పెళ్ళిగోల పేరుతో జబర్ధస్త్ టీమ్ చేసిన సందడికి మంచి రేటింగ్ వచ్చింది. పండుగ రోజు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ షోకి 10.79 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

ఉగాది స్పెషల్ ఎపిసోడ్ తర్వాత ఈటివిలో టాప్ రేటింగ్ సాధించింది ఎక్స్ ట్రా జబర్ధస్త్. ఈ షోకి 6.46 పాయింట్ల రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత జబర్ధస్త్ షోకి 5.56 పాయింట్లు దక్కాయి. ఇక సీరియల్స్ లో మనసు మమతి 5.19, స్వాతి చినుకులుకి 4.90, నా పేరు మీనాక్షి సీరియల్ కి 4 పాయింట్ల రేటింగ్ దక్కింది.

జీ తెలుగు చానల్ ఈ వారం థర్డ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ జీ తెలుగు చానల్స్ లోని సీరియల్స్ కి అంతగా రేటింగ్ రావడం లేదు. ఈ చానల్ లో ఈ వారం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ రక్తసంబంధం.

రేటింగ్స్ ఓవరాల్ గా థర్డ్ ప్లేస్ లో ఉన్న జీ తెలుగు చానల్ లో, రక్తసంబంధం సీరియల్ ఇండివిడ్యువల్ గా టాప్ లో ఉంది. ఈ సీరియల్ కి 5.49 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రేమ సీరియల్ కి 4.45 పాయింట్లు దక్కాయి. అలాగే గుండమ్మ కథ సీరియల్ కి 4.50 పాయింట్ల రేటింగ్ వచ్చింది. కళ్యాణవైభోగమే సీరియల్ 4.29 పాయింట్లు సాధించింది. మాటే మంత్రము సీరియల్ 4.25 పాయింట్లు తెచ్చుకుంది. అంటే జీ తెలుగు చానల్ లోని సీరియల్స్ అన్నింటిలోనూ ఒక్క సీరియల్ కి మినహా, ఈ వారం 5 పాయింట్ల కంటే తక్కువే రేటింగ్ వచ్చింది. అందుకే ఈ చానల్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి తగ్గిపోయింది.

జెమిని టివి కూడా కొద్ది వారాలుగా ఫోర్త్ ప్లేస్ లోనే ఉంటోంది. ఇందులోని సీరియల్స్ కి 5 పాయింట్లు రేటింగ్ రావడం కూడా కష్టంగా ఉంటోంది. అలాగే సినిమాలతోనూ మిగతా చానల్స్ తో పోటీపడలేకపోతుంది. ఈ వారం జెమినిలో టెలికాస్ట్ అయిన పండగ స్పెషల్ ఉగాది ఉత్సవం ఎపిసోడ్ కి 5.53 పాయింట్లు వచ్చాయి. రంగస్థలం షోకి 4 పాయింట్లు దక్కాయి. ఇక సీరియల్స్ అన్ని మూడు పాయింట్లతోనే సరిపెట్టుకున్నాయి.

స్టార్ మాటివిలో ఈ మధ్యే మరో కొత్త సీరియల్ స్టార్ట్ అయ్యింది. కనులు మూసినా నీవాయే పేరుతో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఓ ప్రమాదం వల్ల పెళ్ళి కాకుండానే తల్లిగా, కోడలిగా మారిన ఓ అమ్మాయి జీవితం ఎలా సాగిందనేది ఈ సీరియల్ కథ. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సుకృత, ఈ సీరియల్ గురించి చెప్పిన విశేషాలు ఈ స్పెషల్ ఇంటర్వ్వూలో చూద్దాం.

Recommended For You