బడ్జెట్‌లో వైద్యానికి పెద్దపీట వేసి నిధులు కేటాయించాలి : ఉపరాష్ట్రపతి

బడ్జెట్‌లో వైద్యానికి పెద్దపీట వేసి నిధుల కేటాయింపు చేయాలని.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆరోగ్య భారత్‌ను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పాశ్చాత్య పోకడల కారణంగా ఆహారపు అలవాట్లు మారిపోయాయని చెప్పారు. ఉచిత వైద్య శిబిరానికి ముందుకు వచ్చిన కేర్‌ ఆస్పత్రి, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Recommended For You