దారుణం: తల్లిని చంపిన కొడుకు

Woman, 66, Dies After Son Repeatedly Hits Her With Brick In Ghaziabad

మనుషుల్లో మృగం నిద్ర లేస్తుంది.రోజు రోజుకు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ క్రూరుడు తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. డబ్బులు ఇవ్వడం లేదని తల్లిని చంపేశాడు. వివరాల్లోకి వెళ్లితే ఘజియాబాద్‌కు చెందిన రామ్త్రి(66) అనే మహిళకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో ఓ కుమారుడు నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. దానికి తల్లిని రూ. లక్ష ఇవ్వమని అడిగాడు. అతనికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అదను చూసి పోలంలో పని చేసుకుంటున్న తల్లిపై ఇటుకతో దాడి చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానికంగా ఉన్నఅడవీలో పడివేశాడు. తల్లి కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. పొలం సమీప ప్రాంతాల్లో గాలించగా తల్లి మృతదేహం లభ్యమైంది వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులకు ఆమెను హత్య చేసింది కొడుకే అని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు.

Recommended For You