మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు

మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని వీరంగం సృష్టించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కలకలం సృష్టించింది. కొందరు యువకులు ఓ వైన్ షాప్ దగ్గర మద్యం తాగారు. మందు తాగేటప్పుడు వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.