దారుణం.. పెళ్లి పేరుతో 8వ తరగతి చదువుతున్న బాలికను..

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లి పేరుతో వంచించాడు శంకర్ అనే వ్యక్తి. పెళ్లి చేసుకొని మూడు నెలల పాటు వాడుకొని పత్తా లేకుండా పారియపోయాడతను. ఎమ్మిగనూరుకు చెందిన మైనర్ బాలిక మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఇంద్రానగర్ లో పాస్టర్ అంజనేయులు..శంకర్ తో మైనర్ బాలికకు పెళ్లి చేశాడు. ఇద్దర్ని రెండు నెలలుగా తన దగ్గరే ఆశ్రయం ఇచ్చాడు. బాలికతో మూడు నెలలు గడిపిన తర్వాత పారిపోయాడు. వారం రోజులుగా భర్త కనిపంచకపోవటంతో పాస్టర్ ను ప్రశ్నించారు బాధితులు.