ఈ పాము తలకు ఓ ప్రత్యేకత ఉంది.. అదేంటో కనుక్కున్నారా?

రెండు తలల పాములు, ఐదు తలల పాములు ఉంటాయని పూర్వికులు చెబుతుంటారు. అయితే ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు. ఇక మీరెప్పుడైనా మూడు కన్నుల పామును చూశారా..? బహుశా ఇది కూడా చూసి ఉండకపోవచ్చు. ఉత్తర ఆస్ట్రేలియాకు చెందిన వన్యప్రాణుల అధికారులు రహదారిపై మూడు-కన్నుల పాము ఫోటోలను షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ పాము ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ కార్పెట్ పైథాన్ ను ముద్దుగా మాంటీ పైథాన్ అని పిలుస్తారు, ఇది మార్చి నెలలో కనుగొనబడింది.

ఆ తరువాత కొన్ని వారాలకు ఈ కార్పెట్ పైథాన్ మరణించింది. వన్యప్రాణనిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఆ పాముకు మూడు కళ్ళు ఉన్నాయని దాని తల పైన, ఒక సహజ మ్యుటేషన్ కనిపించిందని చెబుతున్నారు. రేంజర్స్ డార్విన్ నుంచి 40km దూరంలో ఉన్న ఆగ్నేయ హంప్టీ డూ పట్టణంలో దీనిని కనుగొన్నారు. ఇది 40 సెంటీమీటర్ల పొడవు దాని వైకల్యం కారణంగా తినడానికి కష్టపడుతోందని వెల్లడించారు. ఈ పాముకు రెండు తలలు కలిసి లేవు అని ఎక్స్-రే స్కాన్లలో చూపించారు. ఇది ఒక అదనపు కన్నుమాత్రమే కలిగి ఉందని చెప్పారు. ప్రతి శిశువుకు ఓ విధమైన పరివర్తన ఉంటుంది – ఇది ఒక ప్రత్యేకంగా ముతకగా మరియు మిస్షాప్ను కలిగి ఉంది” అని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫ్రై చెప్పారు.

Recommended For You