పబ్లిక్ ప్లేసులో హద్దులు చెరిపేసి.. హగ్గులు.. ఆపై..

సమాజం ముందుకు పోతోంది అంటే ఏవిటో అనుకున్నానే బిడ్డా.. ఇట్టా బరితెగిస్తున్నారనుకోలేదే తల్లీ.. ఇదేం పోయేకాలమే.. నాలుగ్గోడల మధ్య సాగించాల్సిన కార్యకలాపాలను ఇలా నలుగురూ చూసి ఏమనుకుంటారో అని ఇసుమంతైనా లేకుండా.. ఛీ.. ఛీ.. అరాచకాలు, అత్యాచారాలు జరగమంటే జరగవు.. కొంచెమైనా బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లా.. దానికి ప్రేమా అనే ఓ ముసుగు తగిలించడం.. ఏంటోనే తల్లీ ఇవన్నీ చూడ్డానికేనా దేవుడు నన్ను ఇంకా.. బామ్మగారి బాధ వర్ణనాతీతం..

కలిసి కాలేజీకి వెళ్లడం నించి మొదలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా అమ్మాయిలు, అబ్బాయిలూ ఒకరి మీద పడి ఇంకొకరు. అసలే ట్రాఫిక్‌లో సరిగ్గా ఇంటికి చేరతామో లేదో తెలియని పరిస్థితి. మరి ఇలాంటివి రోడ్డు మీద కనిపిస్తే.. జరిగే యాక్సిడెంట్లకు బాధ్యులు ఎవరు. ఢిల్లీలోని రద్దీగా ఉన్న ఏరియాలో అందరూ చూస్తుండగానే ఓ యువ జంట హద్దులు దాటేసారు. ముద్దు మురిపాలో మునిగిపోయారు. బైక్ ట్యాంకర్ మీద కూర్చుని మరీ ప్రియుడితో కౌగిలింతలు, కిస్సులు.. ఎవరేమనుకుంటే మాకేమి అన్నట్టుంది వాళ్ల వ్యవహారం. దారిన పోయే జనాలకు ఫ్రీ సినిమా చూపించింది ఈ జంట. ఇప్పుడొస్తున్న సినిమాలే వీరికి ఇన్‌స్పిరేషన్ అని ముక్కున వేలేసుకున్నారు మరికొంతమంది. దారిన పోయే ఓ వ్యక్తి ఈ దృశ్యాలను సెల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

Recommended For You