కాటేసిందని పామును కొరికి చంపాడు..

పాము కాటేసిందని ఆగ్రహాం చెందిన వృద్ధుడు ఆ పాముని కొరికి చంపేశాడు. తనను కరిచిన పామును వెంటాడి పట్టుకుని మరి కొరికి చంపేశాడు. పామును పట్టుకోవాలన్న కసితో.. తన ప్రాణం గురించి ఆలోచించుకోలేక పోయాడు. చివరికి అతని శరీరం మొత్తం విషం పాకి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని మహిసాగర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు పొరుగూరికి వెళ్తుంటే పాము కాటేసింది. దీంతో అతడికి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్నే కాటేస్తావ నీకెంత ధైర్యం అంటూ.. పామును వెంబడించాడు. దాన్ని వెంటాడి పట్టుకున్నాడు. కసితో ఆ పామును కొరికి, కర్రతో కొట్టి చంపేశాడు. పాము మీద ఉన్న కోపంతో తన ప్రాణం గురించి పట్టించుకోలేదు. పాముని చంపిన తరువాత అతని కోపం చల్లారింది. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే శరీరమంతా విషం పాకడంతో ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Recommended For You