భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. కోరాపుట్ జిల్లా పాడువా పీఎస్ పరిధిలోని కిటువకంటి సమీపంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులతో కాసేపు ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఘటనా స్థలంలో 3 ఎస్సెల్లార్‌లు, 2 ఇన్సాస్‌ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు మకాం వేసినట్టు పక్కా సమాచారం రావడంతో.. ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

Recommended For You