డిగ్రీ అర్హతతో నీతి అయోగ్‌‌లో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ‌ఫార్మరింగ్ ఇండియా (నీతి ఆయోగ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీలు: 60 ఒప్పందకాలం: రెండేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు
మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ లీడ్ పోస్టులు: ఖాళీలు 10 ఒప్పందకాలం: రెండేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు
ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు: ఖాళీలు 2 ఒప్పందకాలం : రెండేళ్లు అర్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లు మించకూడదు
ఇన్నోవేషన్ లీడ్ (అటల్ ఇన్నోవేషన్ మిషన్): ఖాళీలు 12 ఒప్పందకాలం: మూడేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ: మే22, 2019 వెబ్‌సైట్: https://niti.gov.in

Recommended For You