మహర్షి మూవీ‌.. చిరంజీవి గారు ఫోన్‌ చేసి.. – దేవిశ్రీప్రసాద్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయి టెర్రిఫిక్‌ కలెక్షన్స్‌తో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.6 కోట్ల షేర్‌ వసూలు చేసి ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మే 10 (శుక్రవారం) చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకుంది.

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు : ”మహర్షి’ మే 9న రిలీజై మహేష్‌బాబు కెరీర్‌లో హయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌ చేసింది. ఇది ముందుగా ఎక్స్‌పెక్ట్‌ చేసిందే. మొదటి రోజు సినిమాని చూసి మహేష్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రెవెన్యూ ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.

దర్శకుడు వంశీ పైడిపల్లి : ఇదొక హార్ట్‌ హిట్టింగ్‌ ఫిల్మ్‌. ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళి ఒక మంచి ఆలోచనను సృష్టిస్తుంది. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తుంది. ఇదొక థాట్‌ ప్రొవోక్‌ సినిమా. ఇంటర్నల్‌గా మనం వెతుక్కునే సక్సెస్‌, అలాగే ఎక్స్‌టర్నల్‌గా ఒక సమాజానికి ఎలా ఉపయోగపడాలి అని రెండు పాయింట్లు చెప్పాం.

హీరోయిన్‌ పూజా హెగ్డే : మహేష్‌గారి ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ‘పాలపిట్ట’ సాంగ్‌కి స్క్రీన్‌ కనపడకుండా పేపర్స్‌ వేయడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది.

రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ : చిరంజీవి గారు ఫోన్‌ చేసి సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని పాయింట్‌ టు పాయింట్‌ చెప్పారు. చిరంజీవిగారికి మా అందరి తరపున థాంక్స్‌. మహేష్‌గారి 25వ సినిమా ‘మహర్షి’, అలాగే ఎన్టీఆర్‌గారి 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం’ చిరంజీవిగారి 150వ సినిమా ‘ఖైది నెంబర్‌ 150’ ఇలా.. వీళ్లందరి ల్యాండ్‌ మార్క్‌ ఫిలింస్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను.

Recommended For You