జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు… ఎందుకో తెలుసా?

ఒక్క నిమిషం ఇంట్లో కరెంటు పోతే కరెంటు వాళ్ళని బండబూతులు తిట్టుకుంటాం. అలాంటిది 79 ఏళ్ల పాటు కరెంటు వాడలేదు ఓ వృద్ధురాలు. పూణెలోని బుధ్వార్ పేఠ్‌లో నివసిస్తున్న ఈమె పేరు హేమా సానే.. వయస్సు 79 సంవత్సరాలు. ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఆమె 79 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు వినియోగించలేదు. దీనికి కారణం పర్యావరణం, ప్రకృతిపై ప్రేమ అని ఆమె చెబుతారు. వేలాదిరూపాయలు పెన్షన్ వస్తున్నా ఇప్పటికి ఆమె పూరి గుడిసెలోనే ఉంటోంది.

అది తన ఇల్లు కాదు తన పెంపుడు శునకం, రెండు పిల్లులు, ముంగీస, పక్షుల నివాసమని, వాటిని చూసుకోవడానికే అడవికి దగ్గరలో ఇంటిని నిర్మించుకొని ఉంటున్నారు. ఆమెను చూడటానికి బంధువులు ఎవరైనా వచ్చినా తగిన సదుపాయాలు ఉన్నాయి కానీ కరెంటు మాత్రం ఉండదు. ఆమె పిల్లలు వారానికి రెండుమూడు సార్లు ఆమె దగ్గరికి వచ్చి వెళుతుంటారు. తాను చనిపోయేంతవరకు ప్రకృతి మధ్యే గడుపుతాను కానీ కరెంటు మాత్రం వాడనని చెబుతోంది.

Recommended For You