పైలట్ల మధ్య గొడవ.. డ్రైనేజీలోకి దూసుకెళ్లిన ఫ్లైట్

ఇద్దరూ పైలట్స్ మధ్య నెలకోన్న వివాదం ఏకంగా విమాన ప్రమాదానికి కారణమయేలా చేసింది. గొడవ కారణంగా విమానం నడుపుతున్న పైలట్ దాన్ని నేరుగా డ్రైనేజీలోకి దింపాడు. తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలను పట్టించుకుని ఓ సీనియర్ పైలట్ చేసిన ఘనకార్యం ఇది. ఈ సంఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 2017లో చోటుచేసుకుంది. రెండేళ్ల తర్వాత ప్రమాదాల వివరాలు బయటపడ్డాయి.

అబుదాబి నుంచి 102 మంది ప్రయాణికులతో కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైంది.విమానం కిందికి దిగుతున్న సమయంలో పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ప్లైట్ చక్రాలు డ్రైనేజీలో దిగిపోవడంతో విమానం అక్కడే ఇరుక్కపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై అప్పట్లో జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. విచార నివేదికలో విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న సహచర పైలట్ హెచ్చరిస్తున్న పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తెలిపింది. వర్షం భారీగా కురుస్తుంది. రన్‌వే మార్క్స్ కనిపించడం లేదు అందువల్ల కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్‌ను కోరింది. ఆమె చెబుతున్న వినకుండా విమానాన్ని రంగ్ రూట్‌లో ల్యాండ్ చేసి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు ఆ సీనియర్ పైలట్. దీంతో అతనిపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. పైలట్‌ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది.ఈ ఘటనతో డీజీసీఏ.. విమానయాన సంస్థలకు ఓ సూచన చేసింది. ఇకపై విమానంలోని పైలట్ల మధ్య వయస్సు వ్యత్యాసం ఎక్కువ లేకుండా జాగ్రత్తపడాలని తెలిపింది.

Recommended For You