హెలికాప్టర్‌ను రిపేర్ చేసిన రాహుల్ గాంధీ.. వైరల్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మెకానిక్‌గా మారారు. నేలపై పడుకొని హెలికాప్టర్‌ను రిపేర్ చేశారు. హెలికాప్ట ర్‌లో ప్రాబ్లెమ్ రావడంతో తామంతా కలసి సరి చేశామని రాహుల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్ట ర్‌లో ప్రాబ్లెమ్ వచ్చిందని రాహుల్ తెలిపారు. వెంటనే హెలికాప్టర్ సిబ్బంది దాన్ని సరి చేస్తుండగా రాహుల్ కూడా ఓ చేయి వేశారు. హెలికాప్టర్ కిందికి దూరి మరీ రిపేర్‌ చేశారు. మంచి టీం వర్క్‌ అంటే అన్ని చేతులు కలిసి పని చేయ డమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్‌లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు అని రాహుల్ పేర్కొన్నారు.

రాహుల్ హెలికాప్టర్‌ రిపేరింగ్‌ ఫోటో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఫొటోను 86వేల మందికి పైగా లైక్‌ చేశారు. గ్రేట్‌ సర్‌…. మీరు చాలా గొప్పవారు’ అంటూ వేల మంది కామెంట్ చేస్తున్నారు.

Recommended For You